కొలిప్యాక్ గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన…

On: Friday, March 13, 2026 11:07 AM

 

ముదిరాజ్ సంఘం నుంచి విరాళం…

ఆర్మూర్:

12-03-2026

గురువారం కొలిప్యాక్ ముదిరాజ్ సంఘ పెద్దల ఆహ్వానం మేరకు కొలిప్యాక్ గ్రామంలోని పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఆర్మూర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం తరఫున దేవాలయ నిర్మాణానికి రూ. 11,001/- చందా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దబజార్ అధ్యక్షులు బోండ్ల పెద్దలు, క్యాషియర్ గాజం మహేందర్, మందుల గోపి, ముదిరాజ్ సంఘం రాజారాం నగర్ అధ్యక్షులు జంగిడి పెద్ద భోజన్న పాల్గొన్నారు.

అలాగే పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ గాజం మచ్చేందర్, వైస్ చైర్మన్ వేముల భోజన్న బొంబాయి, కల్చరల్ సెక్రటరీ బోండ్ల గోపి, ఆర్గనైజేషన్ సెక్రటరీ సైదు రమేష్, సాంబడి నడిపి పోశెట్టి, సాంబడి ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు సహకరించాలని సంఘ నాయకులు కోరారు.

13 Mar 2026

Leave a Comment