A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:
ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో జరగబోయే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
మండల పరిధిలోని 26 గణేష్ మండపాల విగ్రహాలు చెరువులో నిమజ్జనం కానున్న నేపథ్యంలో, తహసిల్దార్ వెంకట్రావు, ఎస్సై సందీప్ గురువారం చెరువు వద్ద ఏర్పాట్లను తనిఖీ చేశారు.
అధికారుల సూచనలు:
నిమజ్జన కార్యక్రమం నిర్వాహకుల బాధ్యతగా ఉండాలని తహసిల్దార్ వెంకట్రావు స్పష్టం చేశారు.
కులమతాలకు అతీతంగా శాంతియుతంగా పండుగ జరగాలని, డీజే లు నిషేధం అని మండపాల నిర్వాహకులకు తెలిపారు.
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరికి ఇబ్బంది లేకుండా సాఫీగా నిమజ్జనం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని ఎస్సై సందీప్ పిలుపునిచ్చారు.
భద్రతా చర్యలు:
చెరువు గట్ల వద్ద కరెంటు లైట్లు సరిగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించారు.
భక్తుల రక్షణ కోసం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, వీడీసీ చైర్మన్ ఖాజాపూర్ మహేందర్, కమిటీ సభ్యులు మిట్టపల్లి దాసు, ఉప్పల్ రాజేందర్, బుట్టి మాణిక్యం, ఫిప్పరి హనుమంతు, చూసా సంతోష్, శ్రీపతి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.







