JAKRANPALLY:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసిన UPS పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ దేశభక్తి స్ఫూర్తి మన దేశ గొప్పదనానికి దొహద పడేలా మనల్ని ప్రేరేపిస్తుంది అని, భారతదేశాన్ని నిర్వచించే విలువైన స్వేచ్చ, సమానత్వం మరియు న్యాయాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది అని, మన పూర్వీకులు సంపాదించిన స్వేచ్ఛకు ప్రతి పౌరుడు సంరక్షకుడు కావాలని దానిని సురక్షితంగా ఉంచుకోవాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు, అలాగే గ్రామ వీడీసీ పెద్దలు, యువకులు మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మన వీరుల త్యాగాలను గుర్తుంచుకుందాం మరియు బలమైన ఐక్య భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం అని అలాగే స్వేచ్ఛ అనేది ఒక విలువైన బహుమతి దానిని మన దేశం పట్ల భాధ్యత, గౌరవం మరియు ప్రేమతో కాపాడుకోవాలని వారు అన్నారు, అనంతరం విద్యార్థుల ఆట, పాటలు అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మరియు గ్రామ వీడీసీ,మహిళా సంఘాలు, గ్రామ యువకులు, విద్యార్థుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.







