పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి….

On: Sunday, September 14, 2025 9:37 PM

 

మాసాయిపేటలో ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం.

ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 14:

మాసాయిపేట మండల అభివృద్ధి కోసం ఎదురవుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధుల బృందం ఆయనకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాసాయిపేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిన్నచౌదరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నాగేందర్ రెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు గుండ్ల రాజు పాల్గొన్నారు.

వినతిపత్రంలో ప్రధానంగా అండర్‌గ్రౌండ్ బ్రిడ్జ్‌లో నిలిచే నీటి సమస్య, జాతీయ రహదారి ఫ్లైఓవర్ నిర్మాణం (చెట్ట్లతిమ్మాయిపల్లి జంక్షన్ వద్ద), మరియు మాసాయిపేట సర్వీస్ రోడ్ల అభివృద్ధి అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు స్పందించిన ఎంపీ రఘునందన్ రావు గారు, అండర్‌గ్రౌండ్ బ్రిడ్జ్ సమస్యపై రైల్వే జీఎంను సంప్రదించి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే, రోడ్ల సమస్యలపై తాను స్వయంగా వ్యవహరిస్తానని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాసాయిపేట మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రామ అభివృద్ధి కోసం ఎంపీ చేసిన హామీలకు మేము కృతజ్ఞులం. త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకం ఉంది” అని తెలిపారు.

15 Mar 2026

Leave a Comment