ఐదు గ్రామాల ప్రజలు ఎంపీ రఘునందన్ రావుకి హర్షం వ్యక్తం.
ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్ ,జులై 31
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు చెట్లా తిమ్మాయిపల్లి, రామంతపూర్, అక్కింపేట, నాసాన్పల్లి, మాసాయిపేట పట్టణం, గ్రామాలకు ఐమాక్స్ లైట్లు ఇప్పించడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజక వర్గంలో సొంత నిధులతో ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడతాడు అని కొనియాడారు. అదే విధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో సోలార్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ఎంపీ ల లాగ కాకుండా రఘునందన్ రావు ఒక మాట చెబుతుండేవారు మోచేతిలో బలముంటే మొండి కొడవలి కూడా తెగుతది అన్న చందంగా నిజంగా నాయకుడిలో ధైర్యం ఉంటే ఎక్కడి నుండైనా నిధులు రాబట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తాడు. అనేదాంట్లో భాగమే ఈ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇట్టి సోలార్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయించి నందుకు ఎంపీ రఘునందన్ రావు కి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ కి, మాసాయిపేట గ్రామస్తులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాసాయిపేట మాజీ ఉప సర్పంచ్ ఊదండపురం నాగరాజు, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నరసింహులు, మాజీ వార్డు సభ్యులు, బిజెపి నాయకులు బూత్ కమిటీ అధ్యక్షుడు నవీన్ యాదవ్, పాపని శ్రీనివాస్, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.