పదే పదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. మీ కుట్రపూరిత రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట తిరగలేరు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి బెడ్‌రూమ్‌లోకి పోలీసులను పంపినప్పుడు నీ సంస్కారం, విలువలు ఎటు పోయాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఏ పోలీస్ అయినా బీఆర్ఎస్ నేతల బెడ్ రూమ్‌లోకి వెళ్లారా? అని అడిగారు. ఎస్కార్ట్ పక్కనబెట్టి రేవంత్ బయటకు వస్తే.. కేటీఆర్ తట్టుకోగలడా? అని మండిపడ్డారు. మీ మంచికే చెబుతున్నా.. మరోసారి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకండి అని హితవు పలికారు.
బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పర్మినెంట్‌గా ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు రాజభోగాలు అనుభవించి పదవి పోయే సరికి షాక్‌లో ఉన్నారంటూ సెటైర్ విసిరారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారా అని ప్రశ్నించారు. బట్ట కాల్చి సీఎంపై, మంత్రులపై వేస్తానంటే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు పదవి పోయాక పదవిలేదనే స్ట్రోక్, ఒకవైపు చెల్లెలి స్ట్రోక్, మరోవైపు బావ స్ట్రోక్ వచ్చిందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రేవంత్‌కు ఉన్న క్రేజ్.. కేటీఆర్‌కు ఎప్పటికీ రాదని అన్నారు.