ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో….
ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ సాయి గ్లోబల్ ఐ కేర్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీలోని ప్రతి షాప్, హాస్పిటల్లలో పనిచేస్తున్న ముస్లిం సోదరులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం సోదరులు డాక్టర్ శ్రీనివాస్ సేవాభావాన్ని, సౌహార్దతను ప్రశంసించారు. గత 8-10 సంవత్సరాలుగా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరవుతూ సోదర భావాన్ని పెంపొందిస్తున్నారని తెలిపారు.
ఇఫ్తార్ విందు ద్వారా ముస్లిం సోదరులతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో పాటు డాక్టర్ శ్రీనివాస్ కి ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ మిత్రబృందం కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








