హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ నేతలతో పాటు హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







