ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని దమ్ముంటే నీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్‌…..

On: Saturday, July 19, 2025 10:43 AM

 

“కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు” అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.

రేవంత్ రెడ్డి దమ్ముంటే, మగవాడివైతే చెప్పు. నీ స్థానానికి అడ్డుపడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోన్లను ట్యాప్‌ చేయలేదా? దమ్ముంటే ప్రమాణం చేసి ఓటేసి చెప్పు. దమ్ముంటే మీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని అని అన్నారు.

కొత్త రాష్ట్రం తెలంగాణను నిర్మాణత్మకంగా, ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి చేసుకున్నాము. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్న చందంగా ప్రజలకు మనపై బోర్ కొట్టింది. కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్ పేరుతో, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు.

చివరకు వృద్ధలు, బలహీన వర్గాలను కూడా మోసం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు జరిగిన నష్టం మన మంచికే. కేసీఆర్ భోజనం మాత్రమే పెడుతున్నారు.. ఈయన బిర్యానీ పెడతాడని ఆశపడి ఓటేశారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏక పక్షంగా గెలుస్తారు. కొన్ని దేశాల్లో రీకాల్ వ్యవస్థ ఉంది.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకాయన బాంబుల మంత్రి ఆయన బాంబులు పేలటం లేదు. మరొక మంత్రి కమిషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. రాష్ట్రం లో ఎరువుల కొరత మళ్లీ పాత రోజులు వచ్చాయని పాటలు పాడుతున్నారు” అని విమర్శించారు.

“బనకచర్లపై చంద్రబాబును కలవనని చెప్పి ఢిల్లీల్లో కలిసి దొరికి పోయారు. గోదావరి జలాలు చంద్రబాబుకు అప్పచెప్పి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు. యనముల సోదరులు అడ్డంగా దోచుకుంటున్నారు. ఇటువంటి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సిగ్గు చేటు. నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి పంపుతున్నారు” అని అన్నారు.

23 Jul 2025

Leave a Comment