A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
ఇంటెన్షిప్లభాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 4వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు,
ఈ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులు ఎంప్లాయర్ దగ్గర ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు షాపులో జరుగుతున్నటువంటి వివిధ పనులలో పాల్గొంటూ రియల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, షాప్ ఓపెన్ అయినప్పటినుండి కస్టమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి వారికి కావలసినటువంటి మెటీరియల్స్ ని ఎలా చూయించాలి వారికి సంబంధించినటువంటి సర్వీసెస్ ని ఎలా ఇవ్వాలి అనే విషయాల పైన పూర్తి అవగాహన పొందుతున్నారు, ముఖ్యంగా కంప్యూటర్స్ కి వచ్చేటువంటి వైరస్లను అలాగే కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ను ఎలా ఈజీగా సర్వీస్ ఇవ్వాలో తెలుసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు,అలాగే ప్రింటర్లలో యూస్ చేసేటువంటి టోనర్స్ ని ఎలా శుభ్రం చేయాలి వాటిలో మళ్లీ కలర్స్ ని ఎలా ఫీల్ చేయాలి అనే విషయాలను ఈజీగా తెలుసుకున్నారు..







