ఆర్మూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి,…..

On: Saturday, March 14, 2026 12:35 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పరిసర ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, శనివారం ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ పిప్రి గ్రామం వైపు వెళ్తున్నాడు.

అదే సమయంలో ఎదురు దిశ నుంచి వస్తున్న స్కూటీని ఆ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీనివాస్ మరియు విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

ఈ ప్రమాదంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. రోడ్లపై వేగంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

14 Mar 2026

Leave a Comment