తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు….

On: Monday, April 13, 2026 3:08 PM

 

హైదరాబాద్:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధ మైంది, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి,సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసు కుంది. ఈ అత్యాధునిక పరికరాలు కేవలం నిమి షాల వ్యవధిలోనే 130 రకాల టెస్టులు ఆటో మేటిక్‌గా నిర్వహిస్తాయి. అనంతరం వాట్సప్‌కు లేదా ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్‌కు టెస్టుల రిపో ర్టులు వచ్చేస్తాయి. ప్రస్తు తం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాన్యువల్ విధానంలో టెస్టులు చేయాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది.

దీంతో రోగుల వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల రోగ నిర్ధారణకు ఎక్కు వ సమయం పడుతుంది. దీనిని తగ్గించి రోగులకు సత్వర చికిత్స అందించేం దుకు ప్రభుత్వం సాంకేతిక తతో కూడిన హెల్త్ ఏటీ ఎంలను తీసుకొచ్చింది. మొదటగా కింగ్ కోఠి, మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్ విధానంతో ఈ హెల్త్ ఏటీఎంలను ప్రభుత్వం ప్రారంభించింది.

వీటి ద్వారా వచ్చే ఫలితాల ను టీ డయాగ్నోస్టిక్ కేంద్రా ల్లో కూడా పరీక్షించారు. దీంతో హెల్త్ ఏటీఎంల ద్వారా వచ్చిన రిజల్ట్స్.. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో వచ్చిన ఫలితాలు ఒకేలా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ల్యాబుల్లో కూడా వీటిని పరిశీలించారు. అన్నీచోట్ల ఒకేలా ఫలితాలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం తో రోగుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్దమ వుతోంది.

దీంతో వేలల్లో ఖర్చు అయ్యే టెస్టులు ఉచితంగా పొందటమే కాకుండా వేగం గా సేవలు పొందవచ్చు. డిజిటల్ రూపంలో టెస్టులు

ఈసీజీ, బీపీ, బాడీ మాస్ ఇండెక్స్, ఆక్సిజన్ లెవల్స్, బాడీ టెంపరేచర్, గ్లూకోజ్, హిమోగ్లోబిన్ లెవల్స్, లివర్, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు నిమిషాల్లో నే ఈ మెషీన్ల ద్వారా కంప్లీట్ అవుతాయి.

ఇక గర్బిణులకు ఫీటల్ డాప్లర్ టెస్టులు, చర్మ వ్యాధులకు డెర్మాస్కోప్ వంటి ఫీచర్లు కూడా ఈ మెషీన్లలో ఉన్నాయి. ఈ మెషీన్ల ద్వారా వచ్చే రోగుల హెల్త్ రిపోర్టులను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధాని స్తారు. దీంతో రోగికి సంబంధించి ప్రతీ రిపోర్ట్ డిజిటల్ రూపంలో వైద్యులకు అందుబాటులో ఉంటుంది.

దీని వల్ల వైద్యులకు రోగుల హిస్టరీ అందుబాటులో ఉంటుంది. దీంతో వేగంగా ట్రీట్ మెంట్ చేయవచ్చు. కాగా ఈ యంత్రాలను ఉపయోగించుకునేలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొంతమంది సిబ్బందిని అధికారులు అందుబాటు లో ఉంచనున్నారు. వీళ్లు రోగులకు సహాయం అందిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.

13 Apr 2026

Leave a Comment