నిజామాబాద్ జిల్లా ధర్పల్లి :
పోలీస్ స్టేషన్ కు మొట్ట మొదటి సారి వచ్చిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి నీ బీ ఆర్ ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పీసు రాజ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ… శాంతి భద్రత విషయంలో కానీ ఇతర సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తమ స్టేషన్ కు మహిళా ఎస్ ఐ రావడం గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పీసు రాజ్ పాల్ రెడ్డి, గజ్జల రమేష్ , మహమ్మద్ నజీర్, అబ్దుల్ మాజిద్, మాలావత్ బాలు, మలవత్ రవి, నరసయ్య, నరేందర్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.