ఉమ్మెడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న గుడ్డోల్ల సాయిరెడ్డి…

On: Saturday, December 13, 2025 3:47 AM

 

ఉమ్మెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్డోల్ల సాయిరెడ్డి గారు ప్రజలకు హామీ ఇస్తూ మాట్లాడుతూ—

“బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తాను. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి పెడతాను. గ్రామంలో ఎవరూ వెనుకబడకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను” అని పేర్కొన్నారు.

అలాగే,

“యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, చదువు–ఉద్యోగాలు–క్రీడల దిశలో ప్రోత్సహిస్తాను. సేవా కార్యక్రమాలను గ్రామమంతా విస్తరిస్తాను. ఉమ్మెడ గ్రామాన్ని నిజాంబాద్ జిల్లాలో ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తాను” అని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అర్హులైన ప్రతి కుటుంబానికి గృహాల ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

“గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉమ్మెడ ప్రజల మన్ననలు పొందుతాను” అని గుడ్డోల్ల సాయిరెడ్డి తెలిపారు.

14 Mar 2026

Leave a Comment