కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..

On: Friday, September 19, 2025 12:20 PM

*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం…

*కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా…

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కోసం తెచ్చిన నర్సరీ మొక్కలు వృధాగా వదిలేసిన మున్సిపల్ అధికారులు. కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఇళ్లకు ఒక్కొక్క మొక్క అందజేయాలని ఉద్దేశంతో కోట్ల రూపాయలు వెచ్చించి తెచ్చిన మొక్కలు సరైన పద్ధతిలో పంపిణీ కాకపోవడంతో అవి స్మశానంలో చెత్తలా పడేయబడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురై, “ప్రభుత్వం డబ్బు వెచ్చించి తెచ్చిన మొక్కలు ఇలా వృథా అవుతుంటే బాధ్యత ఎవరి మీద?” అని ప్రశ్నిస్తున్నారు.

కాలనీవాసులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ, వెంటనే విచారణ జరిపి ప్రజలకు మొక్కలను సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

25 Sep 2025

Leave a Comment