మాసాయిపేట తహసిల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం 12 పోస్టులు మంజూరు….

On: Saturday, August 23, 2025 8:19 AM

 

నర్సాపూర్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు –  పిఎసిఎస్ డైరెక్టర్  ఉదండపురం నర్సింలు స్పందన.

మాసాయిపేట, ఆగస్టు 22 (ఎ9 న్యూస్):

మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట మండలంలో ఇటీవలే ఏర్పాటు చేయబడిన తహసిల్దార్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 12 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

మంజూరైన పోస్టుల్లో తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, ఇద్దరు మండల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (MRI), సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, సర్వేయర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO), చైన్ మెన్, ఇద్దరు అటెండర్లు ఉన్నారు.

ఈ పోస్టుల మంజూరులో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఆవుల రాజిరెడ్డి కృషి చేసినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండాపురం నర్సింలు మాట్లాడుతూ, “బలహీన వర్గాల అభివృద్ధికి ఇది ఉపయుక్తం. ప్రజలకు మరింత న్యాయం అందే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల గ్రామస్థుల మద్దతు పెరుగుతుంది,” అన్నారు.

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆదరణ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

07 Mar 2026

Leave a Comment