Jan 21, 2026,
తెలంగాణ : పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో ‘నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ, తొలి విడతగా రూ.8.26 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ కొత్త పార్కులు అందుబాటులోకి రానున్నాయి. నగర కాలుష్యాన్ని తగ్గించడమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశం.








