చేపూర్ గ్రామభివృద్ధి కోసం పని చేసే అవకాశం ఇవ్వండి.- గడ్డమీది లింగం గౌడ్…

On: Thursday, December 11, 2025 5:13 PM

ఉంగరం గుర్తుకు ఓటు వేయండి అని విజ్ఞప్తి…

 భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి..

చేపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి గడ్డమీది లింగం గౌడ్ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ప్రజలు తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నారు.

లింగం గౌడ్ తెలిపారు. గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని. తాగునీరు, పెండింగ్ రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని అత్యంత వేగంగా పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు.

గ్రామంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమమే నా తొలి ధ్యేయం అని స్పష్టం చేశారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఒక్క కుటుంబానికైనా అందకుండా ఉండకుండా ఇంటింటికీ చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు.

యువతను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచేందుకు మంచి కార్యక్రమాలు, క్రీడా ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తానని గడ్డమీది లింగం గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచుతానని తెలిపారు.

“చేపూర్ అభివృద్ధి కోసం మీ ఒక్క ఓటు… ఉంగరం గుర్తు గెలుపు కోసం మీ ఆశీర్వాదం కావాలి. ప్రజా సంక్షేమమే నా మంత్రము” అని లింగం గౌడ్ గ్రామ ప్రజలను కోరారు.

14 Mar 2026

Leave a Comment