గవ్వలపల్లి అగ్రహారం యువకుడి సినీ ప్రయాణం విజయవంతం….

On: Wednesday, April 8, 2026 9:08 AM

 

మెదక్ జిల్లా గవ్వలపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన సన్నీ అలియాస్ నరేష్ యాదవ్ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 2012లో విడుదలైన ఈగ చిత్రంతో జూనియర్ ఆర్టిస్టుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం గాలిపటం, ధ్రువ, హైపర్, కత్తి, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి పలు చిత్రాల్లో పనిచేశారు.

అంతేకాకుండా టిక్‌టాక్, గోల్డెన్ హే వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా కూడా తన ప్రతిభను ప్రదర్శించారు. గుంటూరు కారం చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, మురుగదాస్, పులిచెర్ల హర్షణ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానళ్లలో ప్రసారమైన సీరియల్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ తన ప్రతిభను మరింతగా చాటుకున్నారు.

08 Apr 2026

Leave a Comment