A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోనీ మిర్ధపల్లి గ్రామములో గ్రామదేవతలకు గ్రామ ప్రజల సమక్షంలో గంగాజల అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా మెలగలని మరియు మంచి వర్షాలు మంచి వాతావరణంతో మంచి పంటలు పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను కోరుకుంటూ అనాది నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం గంగాజల అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.