నందీశ్వర గణేష్ మండలి వద్ద గణపతి రుద్ర హోమం……

On: Tuesday, September 2, 2025 7:02 PM

 

ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఐ, ఎంవిఐ. 

ప్రత్యేక పూజలో పాల్గొన్న పాత్రికేయులు.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కుక్కల గుట్ట, 20వ వార్డు నందీ కాలనీలో గల నందీశ్వర గణేష్ మండలి వద్ద మంగళవారం రోజు గణపతి, రుద్ర హోమాలను సిద్ధుల గుట్ట ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా 20వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుభాయ్, గణపతి విగ్రహ దాతగా ఉండడం చాలా ఆనందదాయకం. వారికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ పి సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ డివిజన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ హాజరై విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు పాల్గొన్న పాత్రికేయులు రాజేశ్వర్ గౌడ్, పద్మారావు, పొట్టి మురళి, రాజేష్, దినేష్, సాయి, రాజేందర్, కేతన్, చేతన్. అనంతరం నందీశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందీశ్వర గణేష్ మండలి సభ్యులు పింజ సుదర్శన్, తోపారం శ్రవణ్ కుమార్, బత్తుల సంతోష్, కోటగిరి స్వామి కుమార్, అలుక రాము గౌడ్, సంతోష్, గోపి, పింజ రుద్రాన్ష్, బత్తుల కౌశిక్, దేవాన్ష్, అన్విక్ తదితరులు పాల్గొన్నారు.

02 Sep 2025

Leave a Comment