ఆర్మూర్లో మోసపు వ్యాపార షాప్ – తిరుమల ట్రేడర్స్ యజమాని పరారీ

On: Thursday, July 31, 2025 4:57 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 31:

ఆర్మూర్ పట్టణంలో “తిరుమల ట్రేడర్స్ (ఆర్డర్స్ సప్లయర్స్)” పేరుతో ఇటీవల ఓ షాప్ ప్రారంభించి ప్రజలను మోసగించిన సంఘటన వెలుగు చూసింది. ఈ షాప్ నిర్వాహకుడు 40 శాతం తక్కువ ధరకు వస్తువులు అందించామని ప్రచారం చేసి, ఆర్మూర్ మరియు పరిసర గ్రామాల ప్రజల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.

పది రోజుల్లో సామాన్లు డెలివరీ చేస్తానని నమ్మకం కలిగించిన షాప్ యజమాని, డబ్బులు తీసుకున్న తర్వాత షాప్ మూసివేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు సిరిగిరి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

పోలీసుల ప్రకారం, నిందితుడు చిత్తశుద్ధితో షాపు పెట్టినట్టు నటించి, ప్రజల్లో నమ్మకం కలిగించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. నిందితుడి పట్టుకోలేకపోతే మరిన్ని ప్రజలు మోసపోవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బాధితులు తమ ఫిర్యాదులను ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దృష్టికి తేవాలని పోలీస్ అధికారి సూచిస్తున్నారు.

01 Aug 2025

Leave a Comment