Aug 10, 2025,
మంచిర్యాల: నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయవర్ధన్, సింహాద్రి, జగదీష్, తేజలను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు మంచిర్యాల ఎసిపి ప్రకాష్ తెలిపారు. గతంలో జులై 30న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసులో విజయవంతంగా నేరస్తులను పట్టుకున్న లక్షట్ పేట సిఐ రమణమూర్తి, ఎస్సైలు సురేష్, తైసుద్దీన్, అనూషలను ఎసిపి అభినందించారు.








