హైదరాబాద్ నగరం నడిబొడ్డున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన…..

On: Monday, August 18, 2025 10:51 AM

 

హైదరాబాద్:ఆగస్టు 18,

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, విగ్రహానికి సోమవారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నారు.

బీసీ నాయకుడిగా పేరున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీల సానుభూతి, అండదండలు పొందడానికే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, బీసీల పూర్తి మద్దతు పొందడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యూహం రచించిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే బీసీలను సంఘటితం చేసేందుకే విగ్రహ ఏర్పాట్లు చేస్తుందని కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు.

అనంతరం 11 గంటలకు రవీంద్ర భారతిలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ఆయన హాజరవుతారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల ముగించుకుని సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, టి -ఫైబర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

14 Mar 2026

Leave a Comment