మెదక్ జిల్లా కొర్రిపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఘన స్వాగతం – వేలాదిమందితో 60వ పుట్టినరోజు వేడుకలు….

On: Sunday, January 11, 2026 5:34 AM

జిల్లా చిన్న శంకరంపేట్ మండలం కొర్రిపల్లి గ్రామంలోని దుర్గాదేవి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారీ కన్వాయ్‌తో చేరుకున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన ర్యాలీగా తండ్రి–కుమారులు ఆలయానికి రాగా, మార్గమధ్యంలో అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

తన 60వ పుట్టినరోజు సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు దుర్గాదేవి ఆలయంలో వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, వేలాదిమంది ప్రజల మధ్య తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment