ఎ9 న్యూస్ ,రామాయంపేట, ఆగస్టు 29:
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కట్రియల్ నుండి పర్వతపూర్, కిషన్ తండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డును,పుష్పలవాగు బ్రిడ్జి ను,కోతకు గురైన కాల్వలను, నీట మునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలసి మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ శుక్రవారం పరిశీలించారు.అనంతరం క్యాట్రియల్ గ్రామంలో దగ్ధమైన పూరి గుడిసెను, తెగిన చెరువు కట్టను, అలుగును పరిశీలించారు.
ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..వర్షానికి దెబ్బతిన్న రోడ్లను,కోతకు గురైన కాల్వలను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పర్వతాపూర్ కిషన్ తండా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాని అన్నారు.వరదల కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా తాండ నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. రెండు రోజులుగా ప్రజలకు విద్యుత్ త్రాగునీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి సహకరించాలని కోరారు.







