*తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి…..

On: Monday, August 18, 2025 11:58 AM

హవెలిఘనపూర్ స్కూల్ తండాలో సంప్రదాయ భక్తి శ్రద్ధలతో తీజ్ ఉత్సవం.

ఎ9 న్యూస్ – ఆగస్టు 18, మెదక్ జిల్లా

హవెలిఘనపూర్ మండలం స్కూల్ తండాలో ఆదివారం జరిగిన తీజ్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక హంగులతో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వై. పద్మదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను తలపై పెట్టుకుని చిన్నారులు నిర్వహించిన నృత్య ఊరేగింపు ప్రజలను ఆకట్టుకుంది. ఊరేగింపులో పద్మదేవేందర్ రెడ్డి స్వయంగా పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు, వేడుకలకు ఆనందాన్ని చేరవేశారు.

తర్వాత సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment