మెదక్, ఆగస్టు 14(ఎ9 న్యూస్):
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఫంక్షన్ హాల్లో మాదాసు శ్రీనివాస్ గౌడ్ కుమారుని వివాహ వేడుక వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభసందర్భంగా చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తన కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “వధూవరులకు అష్టైశ్వర్య సంపదలు కలుగాలని కోరుకుంటున్నాం,” అని తెలిపారు. ఆయనతో పాటు శంకర్ గౌడ్, తీగల శశికాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అమర్నాథ్, జనార్ధన్ గౌడ్, నర్సింలు, సతీష్ తదితరులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకలో సాంప్రదాయాల మధ్య ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అతిథులంతా హర్షాతిరేకాలతో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశార.







