తల్వేద మారాలంటే… నాయకత్వం మారాలి…

On: Monday, December 15, 2025 7:49 PM

 

సర్పంచ్ అభ్యర్థి గడచంద హరిత – కత్తెర గుర్తు

A9 news :

తల్వేద గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో గడచంద హరిత కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నారు. తల్వేద గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం గ్రామానికి సక్రమంగా తీసుకువచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యం అని తెలిపారు.

గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, తల్వేద గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని,కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తల్వేద గ్రామ ప్రజలను గడచంద హరిత పాదాభివందనాలతో వినమ్రంగా కోరుతున్నారు.

14 Mar 2026

Leave a Comment