నిజామాబాద్, A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. సాగునీటి అవసరాలకు తగినన్ని నిల్వలు ఉన్నాయని, రాబోయే రబీ సీజన్‌లో రైతులకు నీటి కొరత తలెత్తే అవకాశమే లేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రాజెక్టు వద్దకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. భద్రతా చర్యలు పాటిస్తూ ప్రజలు సందర్శించుకొని సురక్షితంగా తిరిగి వెళ్లుతున్నారు.







