ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్….

On: Monday, August 18, 2025 8:07 PM

 

A9 న్యూస్ – తూప్రాన్, ఆగస్టు 18

కిష్టాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన భారీ వర్షం.

తూప్రాన్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు ప్రభావంతో గ్రామాన్ని బాహ్య ప్రపంచంతో కలిపే ప్రధాన రహదారి నీటమునిగింది. బ్రిడ్జ్ పైనుంచి నీరు ప్రవహిస్తున్న దృశ్యం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

గ్రామస్థుల చెబుతునట్లుగా, ఇటువంటి భారీ వర్షాన్ని గత 50 సంవత్సరాల్లో చూడలేదన్నారు. “మా చిన్నతనంలో ఇలా ఒకసారి చూసాం, ఇప్పుడే మళ్లీ ఇలాంటి వర్షాన్ని చూస్తున్నాం,” అని ఒక స్థానికుడు పేర్కొన్నారు.

వారం రోజులుగా రాకపోకలు నిలిచిన పరిస్థితి.

వర్షాల ధాటికి అన్ని రహదారులు మూసుకుపోయినట్టు గ్రామస్థులు వెల్లడించారు. గ్రామానికి ఎవరూ రాలేరు, వెళ్లలేరు. శాకాహార సరుకుల కొరత, వైద్య సౌకర్యాల లేమి గ్రామ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తో0ది.

18 Aug 2025

Leave a Comment