సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో ఘోర ప్రమాదం – వ్యక్తి మృతి

On: Monday, September 15, 2025 9:29 PM

 

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్గూడ గ్రామంలోని సింబయోసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒక కార్మికుడు మృతి చెందాడు.

మృతుడిని మహారాష్ట్రలోని పూణేకి చెందిన 32 ఏళ్ల అమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతను ఇతర కార్మికులతో కలిసి ట్యాంకులు శుభ్రం చేయడానికి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. శుభ్రపరిచే సమయంలో వాటర్ ప్రెషర్ పంపు యంత్రాన్ని ఆపరేట్ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

13 Mar 2026

Leave a Comment