ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు…..

On: Sunday, March 29, 2026 11:04 AM

 

హైదరాబాద్:మార్చి 29:

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారు లకు భారత జాతీయ రహదారుల సంస్థ కీలక సమాచారం అందించింది, 2026 27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫాస్టా గ్, వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది, పెరిగిన ధరలు ఏప్రిల్ 1- 2026 నుంచి అమలులోకి రానున్నాయి

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం ఫాస్టాగ్ సంబంధించి కొన్ని కీలక మార్పులు జరుగనున్నా యి,ఈ మార్పునకు కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. జాతీయ రహదారులపై తరచుగా వెళ్లే వారు రాబోయే కొత్త మార్పులపై అవగాహన ఉండటం బెటర్. ఫాస్టాగ్ వార్షిక పాస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000 కాగా, కేవలం 4 రోజుల్లోనే అది రూ. 3,075కు పెరగనుంది. అంటే.. వాహనాదారులు అదనంగా రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ వార్షిక పాస్‌ను రాజ్‌మార్గ యాత్ర యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ సిఫార్సు చేస్తోంది.

కార్డుతో చేసే వన్ టైమ్ పేమెంట్లు ఏడాది పాటు లేదా 200 ప్రయాణాలు పూర్తయ్యే వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక వాహనాదారుడు ఒక సంవత్సరంలోపు 200 ప్రయాణాలు పూర్తి చేసినా చేయకపోయినా వ్యాలి డిటీ ముగిసిపోతుంది. ఒకవేళ వినియోగదారుడు సంవత్సరం ముగియక ముందే 200 ప్రయాణాలు పూర్తి చేసినా కూడా వ్యాలిడిటీ ముగుస్తుంది.

*ఫాస్టాగ్ ఏంటి?ఎందుకు ముఖ్యం…

ఫాస్టాగ్ అనేది ఆర్ఎఫ్ ఐడి టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ. డ్రైవర్లు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వెళ్లొచ్చు. అలాగే టోల్ మొత్తం లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లేదా వాలెట్ నుంచి ఆటో మేటిక్‌గా కట్ అవుతుంది. దేశవ్యాప్తంగా టోల్ వసూలు కోసం ఫాస్టాగ్ అందుబాటులో ఉంది. తద్వారా టైమ్ సేవ్ చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది.

29 Mar 2026

Leave a Comment