“రైతులకు సరిపడా యూరియా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే” అంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ బీఎఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
🌾 యూరియా కొరతపై స్పందన:
తెలంగాణలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈనెల 28వ తేదీలోపు మహబూబాబాద్ నియోజకవర్గానికి కావాల్సినంత యూరియా అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
అధికారులతో చర్చలు:
బుధవారం ప్రభుత్వ సలహాదారుడు వేం. నరేందర్ రెడ్డి
వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు
ఇవాళ ఈ అధికారులను కలిసి నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రమైందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ తెలిపారు.
ప్రభుత్వ స్పందన:
అధికారులు ఈ విషయంపై స్పందించి, ఈనెల 28 కల్లా మహబూబాబాద్ నియోజకవర్గానికి అవసరమైన యూరియా పూర్తి స్థాయిలో పంపిణీ చేయబడుతుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలు:
“రైతులు అధైర్యపడవద్దు. రాజకీయ నాయకుల ఉచ్చుల్లో చిక్కుకోవద్దు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.”
“గత పదిహేను సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లుగా యూరియాను నిరంతరంగా అందిస్తోంది.”
సందేశం:
మహబూబాబాద్ నియోజకవర్గ రైతులకు తక్షణ సాయం కోసం చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








