మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ లైన్…..

On: Tuesday, August 19, 2025 4:50 PM

 

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ల పొడవైన లైన్లో నిలబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తలెత్తడంతో, స్థానిక రైతులు ఉదయం నుండే యూరియా కొనేందుకు భోజనాన్నీ మానేసి క్యూలైన్లలో నిలబడి ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి యూరియా కేంద్రాన్ని సందర్శించి, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం ఇలాంటివి చూడలేదు. ఇప్పుడు రైతులు కిలోమీటర్ల లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. కానీ రైతుల సమస్యలు వినే మంత్రులు, అధికారులు అందుబాటులో లేరు,” అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు ప్రభుత్వ వేళాపాళాలను నమ్ముకుని సాగు మొదలుపెట్టినప్పటికీ, విత్తనాలు, ఎరువుల కొరతతో వ్యవసాయ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. స్థానికంగా యూరియా సరఫరా పెంచాలని, సమయానికి ఎరువులు అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

19 Aug 2025

Leave a Comment