16 ఏళ్ల సేవకు ప్రజల పెద్ద గౌరవo.
ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో సర్పంచ్ పదవికి జరిగిన ఎంపికలో గ్రామ ప్రజలు ఏకగ్రీవ నిర్ణయంతో నాయకపోడ్ వర్గానికి చెందిన ఎర్రం శ్రీనివాస్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. గ్రామంలో ఆయనకు ఉన్న ప్రజాదరణ, సేవా కార్యక్రమాల పట్ల కట్టుబాటు ఈ ఎంపికకు పునాది అయింది.
16 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధిలో ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, టెంట్ హౌస్, వాటర్ ప్లాంట్ వంటి వృత్తులతో గ్రామ ప్రజలకు నిరంతరం సహకరిస్తూ వచ్చిన శ్రీనివాస్, ఈరోజు వచ్చిన ఏకగ్రీవ అవకాశాన్ని తన జీవితంలో పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన సర్పంచ్‌గా నిలబెట్టే అద్భుత అవకాశం లభించింది. ఇది గ్రామ ప్రజలు నాపై ఉంచిన భారీ నమ్మకం.నాకు దక్కిన అతిపెద్ద బహుమతి, అని ఎర్రం శ్రీనివాస్ భావోద్వేగంతో తెలిపారు.
తాను గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.







