గురుకుల కళాశాలలో విద్యార్థి ఉరి వేసుకొని మృతి…
నిరుపేద కుటుంబానికి అంబులెన్స్ సాయంతో అండగా ఈ.ఆర్ ఫౌండేషన్..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బై.పి.సి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ (17) శనివారం ఉదయం ఉరి వేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. అతడు కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం, ఆరేపల్లి గ్రామానికి చెందినవాడు. కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
సంతోష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి అవసరమైన ఖర్చులకు కూడా కుటుంబానికి అవకాశం లేకపోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ.ఆర్ ఫౌండేషన్ వెంటనే స్పందించింది. ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఆదేశాలతో, ప్రతినిధులుగా అర్గుల్ సురేష్ మరియు డిష్ రాంప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కుటుంబానికి అందించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.