A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండలం కొమన్‌పల్లి గ్రామానికి చెందిన హైదరాబాద్ వాసులు, ప్రముఖ వ్యాపారవేత్త నల్ల జగన్ రెడ్డి, సుప్రియ రెడ్డి ల మనుమడు విరాన్షు రెడ్డి పుట్టిన రోజు వేడుక రాత్రి హైదరాబాద్ తుర్కయంజాల్‌లోని జెన్వీ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ హాజరై, చిన్నారి విరాన్షును ఆశీర్వదించారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.
వేడుకలో నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సతీష్ రెడ్డి, సునందా రెడ్డి, కృష్ణా రెడ్డి, అర్గుల్ సురేష్, రాంప్రసాద్, రాఘవ రెడ్డి, రమేష్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.