మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్.చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా ఆయనకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల అవసరమైన మెడిసిన్లు కొనుగోలు చేయడంలో కష్టాలు ఎదుర్కొంటున్న సాయి ప్రసాద్‌కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యవసరంగా మెడిసిన్ అందజేశారు. బ్రహ్మ సమాజ్ వాలంటీర్ ప్రసన్న గారి మొదటి జీతంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం విశేషం.
ఈ కార్యక్రమంలో బ్రహ్మ సమాజ్ వాలంటీర్ కళ్యాణ్, ఫౌండేషన్ అధ్యక్షులు శివ, సభ్యులు రాజు పాల్గొన్నారు. సేవా భావంతో ముందుకు వచ్చిన వారిని గ్రామస్తులు అభినందించారు.








