నత్తనడకలో విద్యుత్ పనులు – రైతాంగం ఇబ్బందులు….

On: Thursday, September 4, 2025 6:24 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:

మండలంలో భారీ వర్షాలతో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు ఇంకా మరమ్మత్తు కాలేదు. పది రోజులు గడిచినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతుల ఆవేదన:

వరి పొలాల్లో పడిపోయిన 33/11 కేవీ స్తంభాలు అలాగే ఉన్నాయి.

బోర్లు ఆన్ చేయలేక పంటలు ఎండిపోతున్నాయి.

పొలాల్లోకి వెళ్లడానికి కరెంట్ భయంతో రైతులు వెనుకడుగు వేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం:

“లేబర్లు లేరు” అంటూ విద్యుత్ శాఖ కాలం గడుపుతోందని రైతులు విమర్శిస్తున్నారు. గన్నారం సబ్‌స్టేషన్ నీటిలో మునిగినా పనులు ప్రారంభం కాలేదు.

రైతుల డిమాండ్:

తక్షణమే లేబర్లు నియమించి పనులు పూర్తి చేయాలని, లేకపోతే పంటలు నాశనం అవుతాయని రైతులు హెచ్చరిస్తున్నారు.

ప్రభావిత గ్రామాలు:

గన్నారం, సిర్నాపల్లి, నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లి, అంశాన్పల్లి, తీర్మాన్‌పల్లి, చంద్రన్‌పల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సమస్యలు కొనసాగుతున్నాయి.

15 Mar 2026

Leave a Comment