A9 news,Jul 11, 2025,
తెలంగాణలో ఆగస్టులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు తెలిసింది. SEP 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తొలుత పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టసవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఏడు రోజుల్లో జారీ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది.