లక్కంపల్లి అభివృద్ధికి చదువుకున్న నాయకత్వం…..

On: Monday, December 15, 2025 7:38 PM

 

సర్పంచ్ అభ్యర్థి – సౌదరి సాగర్

A9 news :

లక్కంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో సౌదరి సాగర్ ఫుట్‌బాల్ గుర్తుతో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజల ముందుకు వచ్చారు. పట్టభద్రుడిగా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తిగా గ్రామ సమస్యలను సమగ్రంగా తెలిసిన నాయకుడిని అని తెలిపారు.

మహిళా సంఘాలకు ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల బలోపేతం, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మార్గదర్శనం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. గ్రామ యువతకు వచ్చే ప్రతి అవకాశాన్ని లక్కంపల్లికి తీసుకువచ్చేలా కృషి చేస్తానని అన్నారు.

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలందరికీ చేరేలా పారదర్శకంగా అమలు చేస్తానని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామానికి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు, హరితహారం వంటి పనులతో గ్రామాన్ని సుందరంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.

తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే, బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని లక్కంపల్లి గ్రామాన్ని నిజాంబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

గ్రామాభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని,ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని లక్కంపల్లి గ్రామ ప్రజలందరికీ సౌదరి సాగర్ పాదాభివందనాలతో వినమ్రంగా కోరుతున్నారు.

14 Mar 2026

Leave a Comment