On: Wednesday, July 16, 2025 4:53 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్‌నగర్ లోని రాంనగర్ కాలనీకి చెందిన గడ్డం రవీందర్ రెడ్డి, చిన్న కుమారుడు గడ్డం రిషిత్ రెడ్డి ఇటీవల జక్రాన్‌పల్లి మండలం అర్గుల్-నారాయణపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రి సమయంలో లక్మాపూర్ శివలింగయ్య దైవదర్శనం నుండి తిరిగి వస్తుండగా, పంది అడ్డు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన రిషిత్ ఇటీవల ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, సహా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించారు. రిషిత్ త్వరగా కోలుకోవాలని రాజశేఖర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు, మాజీ కౌన్సిలర్ గుజ్జేటి రమేష్, పద్మశాలి 5వ తర్ప అధ్యక్షులు సైభ సుధాకర్, కార్యదర్శి కొండ గంగాధర్, వడ్ల నరసింహులు, అర్గుల్ సురేశ్, డిష్ రాంప్రసాద్, విత్తోభ శేఖర్, నూకల శేఖర్, మానకొండూరు భాస్కర్, స్వామి యాదవ్, పెంటి ప్రవీణ్, కర్తాన్ నవీన్, దోమల సుమన్ పాల్గొన్నారు.

22 Jul 2025

Leave a Comment