నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో ఆర్మూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక్ మోహన్ దాస్, హేమలత, దోపతి పరివార్ బాలకృష్ణ, రాజేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 30న అన్నదాన సత్రం, 12 మంది స్వామీజీల సత్సంగ్ సందేశాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.







