A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ పలువురిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.
వాహనం నడుపుతూ మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో ఎస్సై అప్పారావుతో పాటు ఎల్లేష్, సాయి చరణ్, నారాయణ, సంజీవ్, హరీష్, తిరుపతి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






