హైదరాబాద్:ఏప్రిల్ 13
తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 2026-27, విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ విడుదల అయింది, ఉన్నంత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, ఈ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేశారు.మొత్తం మూడు ఫేజ్ ల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
ఒక మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగ నుంది. సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు.
మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్ర మాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవు తాయి.








