Jul 30, 2025,
తెలంగాణ : బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగం గందరగోళంలో పడే అవకాశం ఉందని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవద్దని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాల్సిందేనన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చెప్పారు. సాగు సంక్షోభాన్ని నివారించేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మోదీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని విమర్శించారు.