జక్రాన్ పల్లి మండలంలోని గురువారం జరిగినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ జన్మదిన వేడుకలకు హాజరు అయినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు, అనంతరం జక్రాన్ పల్లి మండలం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కటింగ్ చేసి మండల నాయకులు మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్బంగా వంశీ గౌడ్ మాట్లాడుతూ నా జన్మదిన వేడుకకు విచ్చేసినటువంటి దినేష్ కులాచారి గారికి మరియు మండలంలోని ప్రతి గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు,అదే విధంగా గన్య తాండాకు చెందిన అజ్మీరా మోహన్ నాయకును మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నీయమించారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రాజరెడ్డి, మరియు మండలంలోని ప్రతి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.