ఆర్మూర్ గుండ్ల చెరువును సందర్శించిన జిల్లా కలెక్టర్…..

On: Thursday, August 21, 2025 4:10 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సందర్శించారు. రాబోయే వినాయక చవితి నిమజ్జనోత్సవాల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువులో భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలకు, గజ ఈతగాళ్లు, సౌకర్యాలు, శుభ్రతా పనులు, లైటింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణపతి విగ్రహాల నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

15 Mar 2026

Leave a Comment