వన్నెల(కే) గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…..

On: Sunday, September 7, 2025 11:14 AM

 

A9 న్యూస్ | నందిపేట్, సెప్టెంబర్ 07:

నందిపేట్ మండలం వన్నెల(కే) గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గ్రామ బీజేపీ నాయకుడు రాయికంటి భరత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 30 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అలాగే పాత కార్డుల్లో కొన్ని చేర్పులు కూడా జరిగినట్టు తెలిపారు. ఇంకా గ్రామంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన అందరికీ రేషన్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

13 Mar 2026

Leave a Comment